ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివిత్తన తనిఖీల్లో భాగంగా శ్రీ రామలింగేశ్వర ట్రేడర్స్ సందర్శన

విత్తన తనిఖీల్లో భాగంగా శ్రీ రామలింగేశ్వర ట్రేడర్స్ సందర్శన

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 18 2026: పెద్దమందడి మండల పరిధిలోని వెల్టూరు గ్రామంలో విత్తనాల తనిఖీల కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి సైదులు గురువారం రోజు శ్రీ రామలింగేశ్వర ట్రేడర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విత్తనాల నిల్వలు, విక్రయాల రికార్డులు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా అన్ని నిబంధనలను పాటించాలని డీలర్‌కు సూచించారు. అలాగే విత్తనాల విక్రయంలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సలహాలు అందించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించేందుకు సహకరించాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి సైదులు పేర్కొన్నారు. విత్తనాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!