ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద భోజనం ఏర్పాటు

ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద భోజనం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ గిద్దలూరు పట్టణంలోని శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు ప్రతి సోమవారం పేదల కోసం భోజనం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే ఉదయం స్వామి వారికి అభిషేకం పూలమాలతో నూతన వస్త్రాలతో అలంకరణ చేశారుపూజలో పాల్గొన్న భక్తులకు పేదల కోసం అర్ధవీడు మండలం బోగోలు గ్రామానికి చెందిన చేగిరెడ్డి మహాలక్ష్మమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు భర్త చేగిరెడ్డి రామచంద్రారెడ్డి చెగిరెడ్డి పోతిరెడ్డి లు భోజనం ఏర్పాటు చేశారు. భోజన ఏర్పాటు చేసిన దాతలకు కాశి నాయన పటము శాలువ పూలమాలతో స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించామని యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు తెలిపారు. ప్రతి సోమవారం దాతలు సహకరిస్తున్నందుకు కాశినాయన తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు రోజులలో కూడా దాతలు ముందుకు వచ్చి కాశినాయన ఆశ్రమం దగ్గర భోజనం ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్రాంత సూపర్నెంట్ పాలుగుల్ల కాశిరెడ్డి విశ్రాంత లెక్చరర్ వడ్డి వీరారెడ్డి విశ్రాంత ఆర్మీ లింగారెడ్డి ఏరువ రమణారెడ్డి విశ్రాంత బిఎస్ఎన్ఎల్ అధికారి పోలయ్య రంగారెడ్డి పల్లె బాలరాజు కాశినాయన భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!