బీఆర్‌ఎస్ అంటేనే తప్పుడు ప్రచారం..
0
3
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
Most Popular
- Advertisment -
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయోత్సవ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక శాసనసభ్యులు మేఘ రెడ్డి, పార్లమెంటు సభ్యులు మల్లు రవి, వనపర్తి డిసిసి చీఫ్ శివసేన రెడ్డి, ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి చిట్యాల రోడ్డు వరకు 1000 రోజుల్లో పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, వనపర్తి డిసిసి చీఫ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ అంటేనే తప్పుడు ప్రచారమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేని బీఆర్‌ఎస్.. ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.2 వేల కోట్ల చొప్పున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏం చేశారో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో సీతక్క మాట్లాడారు. కళ్యాణలక్ష్మి పథకంపై ఎవరో కేసు వేస్తే దానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుంటూ కూడా తీసుకోలేదని చెప్పేవారిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని పొందుతూ కూడా తమకు ఏమీ అందలేదని చెప్పేవారికి సంక్షేమ పథకాలను కట్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72 వేల ఉద్యోగాలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని బీఆర్‌ఎస్ నాయకులను సీతక్క నిలదీశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉద్యోగాలు కల్పించామని, పోలీస్ శాఖలోనూ నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశామని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వని టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల రేషన్ కార్డులు, నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లు అందించిందని సీతక్క తెలిపారు. లక్షలాది కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి వారి ఇళ్లలో వెలుగులు నింపామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల సహకారంతో సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులకు బాటలు వేశామని సీతక్క తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న స్థానిక శాసనసభ్యుడిని ఆమె అభినందించారు. హామ్ ప్రాజెక్టు కింద రూ.70 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. మహబూబ్‌నగర్ మట్టి బిడ్డలతో, ములుగు బిడ్డలతో తనకు ఆత్మీయ బంధం ఉందని సీతక్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు. ఈ యొక్క కార్నర్ మీటింగ్ లో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేశారు.