ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన మంత్రి సీతక్క పర్యటన

పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన మంత్రి సీతక్క పర్యటన

📰 Generate e-Paper Clip

– మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.06.2026.వనపర్తిజిల్లాకేంద్రంలోశనివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లోతెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖలమంత్రి  డా. దనసరి అనసూయ(సీతక్క)పాల్గొన్నసందర్భంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతాఏర్పాట్లు,కట్టుదిట్టమైనబందోబస్తుచేపట్టారు.ఎమ్మెల్యేక్యాంపుకార్యాలయంలోనిర్వహించినకల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి సీతక్క గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాఎస్పీ.సునితరెడ్డి,మంత్రిసీతక్కనుమర్యాదపూర్వకంగాకలిసిపూలమొక్కనుఅందజేసిసాదరంగాస్వాగతంపలికారు.మంత్రి సీతక్క  పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు , నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి గారు, వనపర్తి ఎమ్మెల్యే తూడి. మేఘారెడ్డితదితరప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.మంత్రిపర్యటనప్రశాంతంగా,సురక్షితంగా,ఎలాంటిఅవాంఛనీయసంఘటనలకుతావులేకుండాసజావుగా జరిగేలా జిల్లా ఎస్పీ.సునితరెడ్డి,బందోబస్తుఏర్పాట్లను స్వయంగాపర్యవేక్షించారు.కార్యక్రమంజరిగేప్రదేశాలు, ముఖ్యమైన కూడళ్లు, మంత్రి రాకపోకల మార్గాలు, పార్కింగ్,ప్రాంతాలుతదితరప్రాంతాల్లోభద్రతాఏర్పాట్లనుఎస్పీసమీక్షించారు.విధుల్లోఉన్నపోలీసుఅధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, భద్రతా చర్యలను సమన్వయంతో చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమకుకేటాయించినవిధులనుక్రమశిక్షణతో,సమన్వయంతో,సమర్థవంతంగానిర్వర్తించాలనిసూచించారు. మంత్రి పర్యటనను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ముందస్తు భద్రతా చర్యలు, సమగ్ర బందోబస్తు ప్రణాళిక, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా పర్యటన మొత్తం ప్రశాంతవాతావరణంలోకొనసాగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మంత్రి సీతక్క పర్యటనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా, ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతోకార్యక్రమాలుసజావుగానిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగామంత్రిపర్యటనలోఅప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి అభినందించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!