ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

భారత సైన్యం దేశానికి గర్వకారణం

📰 Generate e-Paper Clip

కార్గిల్ విజయ్ దివాస్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 26 2026: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికులకు యావత్ దేశం రుణపడి ఉంటుంది అని కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా వారి త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మాచి సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… కార్గిల్ విజయ్ దివాస్ మన దేశ చరిత్రలో గర్వించదగ్గ రోజు అని భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి ఇది చిరస్మరణీయ నిదర్శనం అని అన్నారు. రాజీవ్ గాంధీపై బోఫోర్స్ గన్స్ లో కుంభకోణం జరిగిందని, నాణ్యత లేదని, బిజెపి ప్రభుత్వం ఆరోపణలు చేసింది కానీ బోఫోర్స్ గన్స్ ద్వారానే కార్గిల్ యుద్ధం గెలిచామని అన్నారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నా ఘన నివాళులు అర్పిస్తున్నాను అని అన్నారు. భారతదేశానికి రైతు, జవాన్ రెండు కళ్ళలాంటివారు అని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చారని తెలిపారు. యువతలో దేశభక్తి భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది అని,దేశం కోసం సేవ చేయాలనే స్ఫూర్తి ప్రతి యువకుడిలో ఉండాలి అని అన్నారు. సరిహద్దుల్లో మన సైనికులు అప్రమత్తంగా ఉండటం వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అని అన్నారు. కార్గిల్ యుద్ధం భారత సైన్యం పరాక్రమం ప్రపంచానికి చాటి చెప్పింది అని అన్నారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటం ప్రతి భారతీయుడి కర్తవ్యం అని అన్నారు. దేశభక్తి అనేది మాటల్లో కాదు, మన ఆచరణలో కనిపించాలి అని అమర జవాన్ల ఆశయాలను కొనసాగించడం ద్వారా వారికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు మన్యం యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, ద్వారాపోగు విజయ్ బాబు, ఎస్ఎల్ రమేష్, నందిమల్ల రామ్, వెంకటేష్, వెంకటన్న, సోషల్ మీడియా రాజు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!