ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

మల్లారంలో శరన్నవరాత్రి వేడుకలు.. చిన్నారి దృశ్య కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణ

📰 Generate e-Paper Clip

శ్రీకృష్ణ సాయి గోశాల ఆధ్వర్యంలో వైభవంగా ఉత్సవాలు.. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం

పొలిటికల్ పవర్,దమ్మపేట, అక్టోబర్18:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో శ్రీకృష్ణ సాయి గోశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం, గోసంరక్షణను పరమావధిగా చేసుకుని గోశాలను నిర్వహిస్తున్న కౌతా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, బతుకమ్మ అలంకరణలు, కోలాట ప్రదర్శనలతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంద

చిన్నారి దృశ్య కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణ

శనివారం నిర్వహించిన ఉత్సవాల్లో హైదరాబాద్‌కు చెందిన చిన్నారి దృశ్య ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన హావభావాలు, నృత్య నైపుణ్యంతో చిన్నారి అలరించడంతో భక్తులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ఆధ్యాత్మిక వేడుకల్లో శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు అవకాశం కల్పించడం సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించడమేనని పలువురు అభిప్రాయపడ్డారు.

నిర్వాహకుల ఆహ్వానంతో హైదరాబాద్‌ నుంచి రాక

దమ్మపేటలో గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహించిన ప్రభాకర్‌ మనవరాలైన దృశ్య, కౌతా ఉమామహేశ్వరరావు ఆహ్వానం మేరకు తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ నుంచి మల్లారం గ్రామానికి వచ్చి నృత్య ప్రదర్శన ఇచ్చింది. చిన్నారి ప్రదర్శనను వీక్షించిన కోలాట బృందం సభ్యులు, భక్తులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.

సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అభినందనీయం

గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో శాస్త్రీయ నృత్యాలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా చిన్నారుల్లో కళల పట్ల ఆసక్తి పెరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం, గోసంరక్షణతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

చిన్నారి దృశ్య నృత్య ప్రదర్శనపై సినీ నటుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా ఆమె తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రీకృష్ణ సాయి గోశాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు, బతుకమ్మ అలంకరణలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Latest Articles

శ్రీశైలం దేవస్థానంలోని ప్రతి బుధవారం *శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం*

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 28( పొలిటికల్ పవర్ న్యూస్ )లోక...

జోరుగా ‘జీరో’ దందా.. లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా పత్తి కొనుగోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

అకాల వర్షంతో పత్తి రైతులకు అపార నష్టం..పత్తి తీయకముందే వర్షం

పంట చేతికొచ్చే సమయంలో ఆర్నబ్ తుఫాన్ రైతులకు తీరని నష్టం..జూలూరుపాడు అక్టోబర్28:...

Related Articles

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 27...
error: Content is protected !!