ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

నందికొట్కూరు వేదికగా కదిలిన రాజకీయం.. వైఎస్సార్‌సీపీ సత్తా చూసి ముగ్ధులవుతున్న జనం! కూటమికి ‘96’ దక్కొచ్చు.. కానీ నైతిక గెలుపు వైసీపీ దే

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

నిన్నటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కూటమి 96 స్థానాల్లో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నా, వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేసిన నందికొట్కూరు, అనంతపురం వైపే రాష్ట్రం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. ‘అధికారం ఉంటే సరిపోదు.. ప్రజల గుండెల్లో చోటు ఉండాలి’ అనే దానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం! నిజమైన గెలుపు అంటే ఏంటో, ప్రజల ఆదరణ ఎటువైపు ఉందో ఈ రెండు నియోజకవర్గాల తీర్పు క్లారిటీ ఇచ్చేసింది.

MPTC, ZPTC పోరుకు సిద్ధం.. కానీ కూటమి ప్యూహాలేంటి?

మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్ ఎన్నికల్లో సత్తా చాటిన తర్వాత, రేపు జరగబోయే MPTC, ZPTC ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. అయితే, ఊహించని ఓటమితో ఇప్పటికే తీవ్ర అవమాన భారంలో ఉన్న నందికొట్కూరు కూటమి నాయకులు రేపటి ఎన్నికలను సజావుగా జరగనిస్తారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

> ఎన్నికల నాటికి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం:

> * వైఎస్సార్‌సీపీ కీలక నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్‌లు చేసే కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం.

> * ఓటింగ్ కేంద్రాల వద్ద రిగ్గింగ్‌లకు పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్థానిక శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

> * మరోవైపు అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్యమా? ‘రెడ్ బుక్’ పాలన ఎన్నికలా?

స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే నిన్నటి ఫలితాలే పునరావృతమవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జరగబోయేది నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలా లేక ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలు చేసే ఎన్నికలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎన్ని అణచివేతలు ఎదురైనా, ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్‌సీపీ క్యాడర్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది. రాజకీయంలో దెబ్బకు దెబ్బ తీస్తూ, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టిన తీరుపై పార్టీ శ్రేణులు ఒకే మాటగా అంటున్నాయి:

“శభాష్ సిద్దార్థ… 💥💥💥”

ముందుముందు జరగబోయే MPTC, ZPTC పోరులో ప్రజా తీర్పును అధికార బలంతో తొక్కేస్తారా? లేక ప్రజాస్వామ్యమే గెలుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే!

 

Latest Articles

మొగరలగుప్ప మూకమామిడి మధ్య వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ  టీం మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు:...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.....

Related Articles

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత. * జిల్లా వ్యాప్తంగా 2,155 మంది పోలీసులతో పటిష్ట భద్రత.  – ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా… అదనపు బలగాల మోహరింపు. ...

  పొలిటికల్ పవర్ ప్రతినిధి   కర్నూలు జిల్లాదస్తగిరి పినవంబర్ 5 న కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని...

ప్రవళిక ప్రాణం తీసింది ఎవరు? చిల్లర కోసం మొదలైన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు...

error: Content is protected !!