ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

చెంచుల మంచినీటి సమస్య తీర్చిన శ్రీశైల దేవస్థానం అధికారులు  * ఈవో ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడుకి గిరిజనుల ధన్యవాదాలు  * స్పందించి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయించిన దేవస్థానం

📰 Generate e-Paper Clip

శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్):

శ్రీశైల దేవస్థానం పరిధిలోని మల్లమ్మ కన్నీరు వెనుక భాగంలో నివాసముంటున్న చెంచు గిరిజనుల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడులకు కొమరం భీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం మరియు స్థానిక గిరిజన మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు వై. ఆశీర్వాదం మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా సుమారు 20 చెంచు కుటుంబాలు అక్కడ నివాసముంటున్నాయని తెలిపారుతాగునీటి సమస్యపై ఐటీడీఏ (ITDA) అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల తమ మంచినీటి కష్టాలను దేవస్థానం ఈవో  దృష్టికి, చైర్మన్  దృష్టికి తీసుకెళ్లగానే వారు తక్షణమే స్పందించారని పేర్కొన్నారు. దేవస్థానం సిబ్బందిని అక్కడికి పంపించి, తాగునీటి కుళాయిని ఏర్పాటు చేసి తమ ఏళ్ల నాటి సమస్యను తీర్చారని కొనియాడారు.

సమస్య వినగానే స్పందించి నీటి సదుపాయం కల్పించినందుకు గిరిజన మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, వీరమ్మ, వీరన్న, మూగమ్మ, దేవయ్య, వెంకటేశం, మంతయ్య, వెంకటమ్మ తదితర చెంచు గిరిజనులు పాల్గొన్నారు.

 

Latest Articles

మహబూబాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ..! 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.5 లక్షల నగదు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత. * జిల్లా వ్యాప్తంగా 2,155 మంది పోలీసులతో పటిష్ట భద్రత.  – ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా… అదనపు బలగాల మోహరింపు. ...

  పొలిటికల్ పవర్ ప్రతినిధి   కర్నూలు జిల్లాదస్తగిరి పినవంబర్ 5 న కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని...

ప్రవళిక ప్రాణం తీసింది ఎవరు? చిల్లర కోసం మొదలైన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు...

నందికొట్కూరు వేదికగా కదిలిన రాజకీయం.. వైఎస్సార్‌సీపీ సత్తా చూసి ముగ్ధులవుతున్న జనం! కూటమికి ‘96’ దక్కొచ్చు.. కానీ నైతిక గెలుపు వైసీపీ దే

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* నిన్నటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త...
error: Content is protected !!