
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
*కొడవలూరు: కొడవలూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెసెంజర్‌గా విధులు నిర్వహిస్తున్న పిర్రల అజయ్ బాబుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ, మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ పాల్యా మురళి నాయక్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు పాల్గొన్నారు..*
*వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 1వ తేదీన కొడవలూరు మండలం వెంకన్నపురంలోని ఎంపీపీ పాఠశాలలో జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దౌర్జన్యానికి పాల్పడి, ఎస్సీ మహిళ దారా ప్రియాంకపై దాడి చేసిన కేసులో పిర్రల అజయ్ బాబు నిందితుడిగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.*
*అదే రోజు బ్యాంకులో విధులకు హాజరైనట్లు నమోదు చేయించుకుని, అదే సమయంలో వెంకన్నపురం పాఠశాల ఎన్నికల సందర్భంగా దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. బ్యాంకులో ఆయన విధుల నిర్వహణ, హాజరు నమోదు అంశాలతో పాటు, బ్యాంకులో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అవకతవకలు, అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్‌ను నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు.*
*ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు..*

