ePaper
Friday, October 30, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బాస్ ఇస్ బ్యాక్ … మళ్లీ రంగంలోకి జూపల్లి రమేష్ బాబు!

 

* బాస్ ఇస్ బ్యాక్… మళ్లీ ప్రజాక్షేత్రంలోకి!

 

* బాస్ ఇస్ బ్యాక్ … అభివృద్ధి బాటలో జూపల్లి రమేష్ బాబు అడుగులు!

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 30)

*అశ్వారావుపేట అభివృద్ధి పనులపై ఫోకస్… విదేశీ పర్యటన ముగిసింది, ఇక పట్టణ పనులే లక్ష్యం!

అశ్వారావుపేట: విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన జూపల్లి దంపతులు మళ్లీ అశ్వారావుపేట మున్సిపల్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాస్ ఇస్ బ్యాక్ … అంటూ రాజకీయ, పట్టణ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పదవులు అలంకారం కోసం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించి ముందుకు సాగాలనే దిశలో ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు పట్టణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే అశ్వారావుపేట మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల అమలు, రేషన్ కార్డుల పంపిణీ, పట్టణాభివృద్ధికి సంబంధించిన కౌన్సిల్ నిర్ణయాలు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం… అభివృద్ధి అవసరాలపై ప్రత్యేక దృష్టి:

ఒకవైపు రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయానికి స్థల పరిశీలన వంటి అభివృద్ధి అంశాలు అశ్వారావుపేటలో చర్చకు వస్తున్నాయి.

ప్రజా సమస్యలు, పట్టణ అభివృద్ధి అంశాలపై మరింత చొరవ చూపుతూ ముందుకు సాగుతారా? అన్నది ఇప్పుడు పట్టణ ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ప్రజల అంచనాలు పెరిగాయి… బాధ్యత మరింత పెరిగింది: అభివృద్ధి పనుల్లో వేగం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం, సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం వంటి అంశాలే ఇకపై ఆయన పనితీరుకు కొలమానాలు కానున్నాయి. అశ్వారావుపేట పట్టణ అభివృద్ధిలో జూపల్లి రమేష్ బాబు తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.

Latest Articles

క్షణిక కామం కోసం… శాశ్వత బంధాల హత్య!సంబంధాల విలువ మరిచిన సమాజానికి ఇది గట్టి హెచ్చరిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

ప్రియుడి కోసం కవల కుమారుల్ని చంపిన తల్లి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బదెస్రా గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపొలిటికల్...

సామినేని రామారావు హత్య కేసు పై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కామెంట్స్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ఉపాధి హామీ పనులపై మేట్లకు శిక్షణ

నారాయణపురం రైతు వేదికలో VB-G RAM G పథకంపై అవగాహన కార్యక్రమంపొలిటికల్...

అశ్వారావుపేట నియోజకవర్గంలో 18,322 మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు

రూ.3.66 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమఅశ్వారావుపేట,పొలిటికల్ పవర్ అక్టోబర్ 30:ప్రధానమంత్రి...

Related Articles

CP O కార్యాలయంలో కోట్ల నిధుల మేత.. అధికారుల అడ్డగోలు దోపిడీ! సర్వే నిధులు పక్కదారి – బంధువుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు!

  కొత్తగూడెం:  పొలిటికల్ పవర్ ప్రతినిధిప్రభుత్వ నిధులను కాపాడాల్సిన అధికారులే కంటికి కనపడకుండా నొక్కేస్తున్నారు! ముఖ్యా ప్రణాళిక కార్యాలయం (సీపీఓ)లో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే పేరిట భారీగా నిధులు పక్కదారి పట్టిన ఉదంతం...

💥 దానవాయిగూడెం అభివృద్ధికి నిరంతర శ్రమ: సుడా (SUDA) చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్‌ను కలిసిన స్థానిక నాయకత్వం! 💥

ఖమ్మం (పాలేరు నియోజకవర్గం): పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డిడివిజన్ అభివృద్ధియే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అడుగులు వేస్తూ.. పాలేరు నియోజకవర్గం, 59వ డివిజన్ (దానవాయిగూడెం) ప్రగతి దిశగా మరో...

బెంగళూరు నందిహిల్స్‌లో వైభవంగా సిరివెన్నెల – అఖిల సాయి కళ్యాణం  * నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు  * వేడుకకు హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు

 పొలిటికల్ పవర్, ప్రత్యేక ప్రతినిధి:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*రెండు మనస్సుల...
error: Content is protected !!