వరదలతో దెబ్బతిన్న ఇళ్లు పంట పొలాలు రహదారులు చెరువుల పరిశీలన
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరద ప్రవాహం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు *రామసహాయం రఘురామ్ రెడ్డి* గారు అశ్వారావుపేట ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు గారు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు గారితో కలిసి విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు
ఈ సందర్భంగా వరద నీటి ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లను పంట పొలాలను రహదారులను చెరువులను పరిశీలించి స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వరదల కారణంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు
ప్రకృతి విపత్తుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వరదల వల్ల నష్టపోయిన బాధితులందరికి న్యాయం జరిగేలా నష్టాన్ని అధికారులు సమగ్రంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని చెరువులు కాలువలు నీటి ప్రవాహ మార్గాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు అదేవిధంగా ప్రజలకు తాగునీరు విద్యుత్ వైద్యం వంటి అత్యవసర సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు
ప్రజా జీవనం యథావిధిగా కొనసాగించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అవసరమైన చోట తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు ముఖ్యంగా రైతులు నష్టపోకుండా వారికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు


