ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

📰 Generate e-Paper Clip

– వన మహోత్సవం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి,ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంపొందించాలిజిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్,తెలుగుదినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగున్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.ఆగస్టు26.2026.మొక్కలపెంపకంద్వారాపర్యావరణ సమతుల్యతనుకాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని జిల్లాకలెక్టర్,ఆదర్శ్,సురభిసూచించారు.మంగళవారం వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలోని అటవీ శాఖ పరిధిలోని ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు.ఈ సందర్భంగా వనమహోత్సవం కార్యక్రమం ప్రాధాన్యతను కలెక్టర్ వివరించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాకు నిర్దేశించిన వన మహోత్సవం 17 లక్షల మొక్కల లక్ష్యాలను సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న మొక్కల నాటే కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని, నాటిన మొక్కలకు నీరు అందించడంతో పాటు వాటి సంరక్షణకుతగినచర్యలుతీసుకోవాలనిఆదేశించారు.మొక్కలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని, వాతావరణ సమతుల్యత, భూగర్భ జలాల పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.నీటి కుంటల తో భూగర్భ జలాలను పెంపొందించాలి,కలెక్టర్ వనపర్తి మండలం నాచహళ్లి గ్రామంలో రైతు విజయ్ వ్యవసాయ భూమిలో వి బి జి రామ్ జీ కింద నిర్మిస్తున్న నీటి కుంటను పరిశీలించారు. నీటి కుంట నిర్మాణం, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు, నిర్మాణానికి సంబంధించిన వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూవర్షపునీటినిపొలాల్లోనేనిల్వచేసుకోవడం ద్వారా నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల రీచార్జ్‌కు ఫామ్‌ పాండ్లు ఎంతోఉపయోగపడతాయని తెలిపారు. వర్షపు నీరు వృథాగా వెళ్లిపోకుండా వ్యవసాయ భూముల్లోనే నిల్వ చేసుకునేందుకు ఫామ్‌ పాండ్ల నిర్మాణాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతపై ప్రభావం ఉండే పరిస్థితుల్లో నీటి సంరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫామ్‌ పాండ్ల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాలను రీచార్జ్ చేసుకోవచ్చని, తద్వారా పంటలకు నీటి లభ్యతను మెరుగుపరచుకోవచ్చని తెలిపారు.అక్కడే రైతు పొలంలో కలెక్టర్ మొక్కను నాటారు. రైతులు తమ పొలాల వద్ద విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. నీటి సంరక్షణ, మొక్కల పెంపకం రెండింటినీ సమన్వయంతో చేపట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో, సవాయిగూడెం సర్పంచ్ యామిని, నాచహళ్లి సర్పంచ్ అబ్దుల్లా, ఇతర అధికారులు రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!