ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

మోజర్లలో సందడిగా అక్షరాభ్యాసం.. అన్నప్రాసన

📰 Generate e-Paper Clip

తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించిన అంగన్‌వాడీ సిబ్బందిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్, ఉపసర్పంచ్ ఆర్. రాములు, సూపర్‌వైజర్ సుధా, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యుగంధర్, అంగన్‌వాడీ టీచర్లు శారద, సువర్ణ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన నిర్వహించి, అక్షరాభ్యాసం చేయించారు.బాలామృతంతో వివిధ రకాల పిండివంటలు, పోషకాహార పదార్థాలను తయారు చేసుకోవచ్చని సిబ్బంది తల్లులకు ప్రత్యక్షంగా తయారు చేసి చూపించారు. అంగన్‌వాడీ కేంద్రంలో అందించే ఒకపూట సంపూర్ణ భోజనాన్ని గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సర్పంచ్ చంద్రశేఖర్ సూచించారు. తల్లులు తమ ఆరోగ్యంతో పాటు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. సూపర్‌వైజర్ సుధా మాట్లాడుతూగర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి వివరించారు. అదేవిధంగా రక్తహీనత నివారణకు అవసరమైన ఆహార పదార్థాలు, పోషక విలువలపై తల్లులకు అవగాహన కల్పించారు. బాలామృతం, అంగన్‌వాడీ ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లులు, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు.

Latest Articles

భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు… మార్మోగిన జై గణేష్ నినాదాలు

జై బోలో గణేష్ మహారాజ్...భక్తి పారవశ్యంలో నిమజ్జనోత్సవం.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

నేటి విద్యార్థుల ప్రవర్తనలో ఆందోళనకర మార్పులు బాధ్యత ఎవరిది??? JSPWS

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

భూమి పట్టా పేరుతో రూ. 5.60 లక్షల వసూలు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై కేసు నమోదు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 19:దమ్మపేట గ్రామానికి చెందిన అత్తులూరి వెంకట రామారావు అనే వ్యక్తి...

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

Related Articles

రేవల్లి మండలంలో ఘనంగా పాఠశాల క్రీడా పోటీలు

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌లో విద్యార్థుల ఉత్సాహభరిత పోటీలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19...

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో...
error: Content is protected !!