ePaper
Friday, November 13, 2026
📄 ePaper

మోజర్ల గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ.. 

📰 Generate e-Paper Clip

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు జాగ్రత్తలకు సూచనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 12 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గురువారం సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి అనుమతులు, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. అలాగే గొర్రెల షెడ్లు, పశువుల షెడ్ల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, గ్రామ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 125 రోజుల పని కల్పించే అంశంపై చర్చించారు. అర్హులైన వారికి కొత్త జాబ్ కార్డులు అందించే విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని గ్రామ అభివృద్ధికి పలు సూచనలు చేశారు.

Latest Articles

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ...

Related Articles

పామాపురం పీఏసీఎస్ నూతన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్ ను సన్మానించిన టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు యం. కిషన్ నాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 14. 2026.పామాపురం పీఏసీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధితో పాటు...

పాలమూరు జిల్లా ప్రజల ఇలవేల్పుగా..భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కురుమూర్తి స్వామీ

– శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవనికి ఆహ్వానo పలికిన పాలక మండలి మాజీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు కొత్తకోట,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...
error: Content is protected !!