ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

రక్తదానం ప్రాణదానంతో సమానం: సర్పంచ్ కొమరం సుశీల

📰 Generate e-Paper Clip

పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం దమ్మపేటలో రక్తదాన శిబిరం 

పొలిటికల్ పవర్, దమ్మపేట,అక్టోబర్30: పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అశ్వారావుపేట సర్కిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో దమ్మపేట పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి పార్కలగండి సర్పంచ్‌ కొమరం సుశీల హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్‌ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, వైద్యులు, అశ్వారావుపేట, దమ్మపేట పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

జిల్లాస్థాయిభజనపొటీలలోముమ్మళ్ళపల్లి గ్రామం శ్రీ గురు హరి భజన మండలి సభ్యులకు ప్రశాంశ పత్రలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి...

🚨 రాప్తాడు రణక్షేత్రం: స్కూలే లక్ష్యంగా ఉన్మాది పైశాచికత్వం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం!

 అనంతపురం, అక్టోబర్ 31: పొలిటికల్ పవర్  ప్రతినిధి నాగరాజు రెడ్డిచదువుకోవాల్సిన బడి...

నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్...

Related Articles

నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి, మాజీ ప్రధాని...

నిధులు తెచ్చే బాధ్యత నాది… డంపింగ్ యార్డు తరలింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి!. మోడీ సహకారంతో ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇస్తున్నాం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.    మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.కీసర సర్కిల్ : జవహర్ నగర్...
error: Content is protected !!