పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో జిల్లాకు పెద్దన్నగా నిలబడి, ప్రతి కార్యకర్తకు అండగా ఉన్న నాయకుడు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి, అధినేత ఆదేశాలను శిరసావహించి, ప్రతి సందర్భంలో పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసిన ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడం బాధాకరమని టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్ పేర్కొన్నారు.
పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా ఆయన పార్టీని వీడకుండా కార్యకర్తలకు అండగా నిలిచి నాయకత్వం వహించారని అన్నారు. శ్రీనివాసులరెడ్డి సేవలు, విధేయత, పార్టీ పట్ల ఉన్న నిబద్ధత కార్యకర్తల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. శ్రీనివాసులరెడ్డి పై తమకున్న ప్రేమ, గౌరవం, అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరదని బొజ్జ తిరుమలేష్ స్పష్టం చేశారు.
రాజ్యసభ సీటు శ్రీనివాసులరెడ్డి కి దక్కకపోవడం బాధాకరం టీ ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్
RELATED ARTICLES
