ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

రైతుల సభకు మహిళా సంఘాల సభ్యుల తరలింపా?: ఏనుగు సుదర్శన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

రైతులకు రుణమాఫీ లేదు.. సభలకు మాత్రం జనసమీకరణ!.

రైతుల సభనా? కాంగ్రెస్ ప్రచార సభనా?.

ముందు పూర్తి స్థాయి రుణమాఫీ చేయండి..                  ఆ తర్వాత రైతుల సభలు పెట్టండి!.

మహిళా రైతుల పేరుతో హడావుడి. రైతుల సమస్యలపై మౌనం!.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏనుగు సుదర్శన్ రెడ్డి ఘాటు విమర్శలు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా: ఘట్‌కేసర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్న రైతు బహిరంగ సభకు మహిళా సంఘాల సభ్యులను అధికారులే తరలిస్తున్నారంటూ మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా సభలకు జనసమీకరణ చేయడంపై దృష్టి పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రైతుల సభకు మహిళా సంఘాల సభ్యులను తరలించడంపై అనుమానాలు వ్యక్తం చేసిన సుదర్శన్ రెడ్డి, అధికారులను ప్రశ్నిస్తే వారు మహిళా సంఘాల నాయకులు కాదని, మహిళా రైతులని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా మహిళా రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఘట్‌కేసర్ మండలంలో ఒక్క రైతుకైనా రుణమాఫీ జరిగిందా? : ఘట్‌కేసర్ మండలంలో ఏ ఒక్క రైతుకూ రుణమాఫీ కాలేదని ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. రైతుల రుణమాఫీ, సాగు సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం సభలకు మహిళలను తరలించడంపై ఎందుకు ఆసక్తి చూపుతోందని ప్రశ్నించారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా భారీ సభలు నిర్వహించడం వల్ల రైతులకు ఒరిగేదేమిటని నిలదీశారు.

సభలో రైతుల సమస్యలు ప్రస్తావిస్తే ఇబ్బందులు తప్పవా? : మహిళా రైతులను పెద్ద సంఖ్యలో సభకు తరలిస్తే అక్కడ రైతుల సమస్యలపై అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల వాస్తవ పరిస్థితులు బయటపడితే సభ రాజకీయ వేదికగా మారుతుందనే భయం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై చర్చ జరగాల్సిన సభల్లో కేవలం జనసమీకరణకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని హితవు పలికారు.

హామీల అమలుపై సమాధానం చెప్పాలి: రైతులకు ఇచ్చిన హామీల అమలు, రుణమాఫీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. సభలకు ఎంతమంది వచ్చారనే లెక్కల కంటే ఎంతమంది రైతులకు న్యాయం జరిగిందనే లెక్కలు ముఖ్యమని పేర్కొన్నారు.

 

రైతుల సంక్షేమం పేరుతో సభలు నిర్వహించడం కాదని, రైతుల సమస్యలను పరిష్కరించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వానికి నిజమైన పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. ఘట్‌కేసర్ మండల రైతుల రుణమాఫీ అంశంపై ప్రభుత్వం స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Latest Articles

మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

ఎమ్మెల్యే జారే,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజికి కృతజ్ఞతలు తెలిపిన...

బీఆర్ఎస్ నాయకుడి తండ్రి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన సోయం వీరభద్రం

 పొలిటికల్ పవర్,దమ్మపేట:మండలంలోని మొండివర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోరకాయల...

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల...

బలీదుపల్లి గ్రామ సంఘం VOAగా శ్రీధర్‌ను తిరిగి నియమించాలి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామ మహిళలు.. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసే...

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన పొలిటికల్ పవర్...

వ్యాపారంలో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య నవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

Related Articles

బీఆర్ఎస్ నాయకుడి తండ్రి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన సోయం వీరభద్రం

 పొలిటికల్ పవర్,దమ్మపేట:మండలంలోని మొండివర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోరకాయల రాంబాబు తండ్రి సోరకాయల పున్నయ్య  మంగళవారం ఉదయం అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్...

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల ప్రతిపాదన మంత్రి వాకిటి శ్రీహరికి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం....

అవినీతికి అడ్డాగా కీసర. కీసరలో ఆగని ఖాకీల అవినీతి దందా. రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.మేడ్చల్ జిల్లా: కీసర: మల్కాజ్గిరి కమీషనరేట్, కీసర...
error: Content is protected !!