ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే జారే,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజికి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి

పొలిటికల్ పవర్, ములకలపల్లి, నవంబర్ 10:మురసు తుఫాను వర్షాలకు తెగిపోయిన మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి.తాత్కాలిక డైవర్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్న వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచి ప్రయాణికులకు మార్గాన్ని పునరుద్దించడం జరిగింది.

వంతెన తెగిపోవడంతో గత కొన్ని రోజులుగా మొగరలగుప్ప గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మూకమామిడి పంచాయతీ నుండి ములకలపల్లి మండల కేంద్రానికి వెళ్లే రవాణా పూర్తిగా నిలిచిపోయింది.రైతులు తమ పంటలను మార్కెట్ కు తరలించలేక,విద్యార్థులు పాఠశాలలకు,రోగులు ఆసుపత్రులకు వెళ్లలేక ఇబ్బంది పడ్డారు.ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించేలా చేశారు.జేసీబీలు,హిటాచీ యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక డైవర్షన్ పనులు చేపట్టారు.
ఈ పనులను మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజి,క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.వాహనాలు సురక్షితంగా వెళ్లేలా దారిని పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ..వంతెన తెగిపోయినప్పటి నుండి మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,ములకలపల్లి మాజీ జడ్పిటిసి బత్తుల అంజి చొరవతో,అధికారులు వెంటనే స్పందించి దారిని పునరుద్ధరించారు.వారికి మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.త్వరలోనే శాశ్వత వంతెన పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అని తెలిపారు.
వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడటంతో మూకమామిడి,మొగరలగుప్ప గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి,బత్తుల అంజికి,సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

బీఆర్ఎస్ నాయకుడి తండ్రి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన సోయం వీరభద్రం

 పొలిటికల్ పవర్,దమ్మపేట:మండలంలోని మొండివర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోరకాయల...

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల...

బలీదుపల్లి గ్రామ సంఘం VOAగా శ్రీధర్‌ను తిరిగి నియమించాలి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామ మహిళలు.. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసే...

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన పొలిటికల్ పవర్...

వ్యాపారంలో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య నవంబర్ 10: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

Related Articles

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల ప్రతిపాదన మంత్రి వాకిటి శ్రీహరికి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం....

రైతుల సభకు మహిళా సంఘాల సభ్యుల తరలింపా?: ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.రైతులకు రుణమాఫీ లేదు.. సభలకు మాత్రం జనసమీకరణ!.రైతుల...

అవినీతికి అడ్డాగా కీసర. కీసరలో ఆగని ఖాకీల అవినీతి దందా. రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.మేడ్చల్ జిల్లా: కీసర: మల్కాజ్గిరి కమీషనరేట్, కీసర...
error: Content is protected !!