ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

రాజకీయంగా ఎదుర్కొనలేకే “రేగా” పై తప్పుడు కేసులు: సోయం వీరభద్రం

📰 Generate e-Paper Clip

 

హైకోర్టు తీర్పుతో రేగా కాంతారావుకు భారీ ఊరట

 

దమ్మపేట: బీఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంపై బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సోయం వీరభద్రం హర్షం వ్యక్తం చేశారు. రేగా కాంతారావును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. రేగా కాంతారావుపై నమోదైన కేసుకు సంబంధించి ఆయన తరఫున చేసిన వాదనలను పరిశీలించిన గౌరవ తెలంగాణ హైకోర్టు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేస్తూ తీర్పు ఇవ్వడం రేగా కాంతారావుకు భారీ ఊరటనిచ్చిందన్నారు. రాజకీయ కక్ష సాధింపుతో కేసులు పెట్టి ఒక నాయకుడి ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించినప్పటికీ, చివరకు న్యాయస్థానం తీర్పుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.రేగా కాంతారావు ప్రజా జీవితంలో ఉంటూ బీఆర్‌ఎస్ పార్టీ కోసం, ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడని సోయం వీరభద్రం అన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత ఆరోపణలు, కేసుల ద్వారా ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. అయితే న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉంచిన రేగా కాంతారావుకు హైకోర్టు తీర్పు న్యాయం చేకూర్చిందని తెలిపారు.”హైకోర్టు తీర్పుతో నిజమే గెలిచింది.. తప్పుడు ప్రచారానికి చెంపపెట్టు పడింది” అని సోయం వీరభద్రం అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కేసులు, ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఇకనైనా రాజకీయ కక్ష సాధింపు ధోరణిని విడనాడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.రేగా కాంతారావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేయడం ద్వారా ఆయనపై చేసిన ఆరోపణల విషయంలో న్యాయపరమైన ఉపశమనం లభించిందని, ఈ తీర్పు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని సోయం వీరభద్రం పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పే అంతిమమని, ప్రజల ముందు నిజానిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

Latest Articles

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – పట్టుబడ్డ ఇద్దరు జూదరులు…

  నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్....

Related Articles

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఫిర్యాదు చేసిన జవహర్ నగర్ తొలి మేయర్: మేకల కావ్య.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.కీసర సర్కిల్ : జవహర్ నగర్: జవహర్...

ఆదివాసీల హక్కుల సాధనకు సమరశీల పోరాటమే శరణ్యం!

దమ్మపేట ఆదివాసి సేన నూతన మండల కమిటీ ఎన్నిక ఆదివాసీల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేపడతాం: నాయకులు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అధికారులపై చట్టపరమైన చర్యలుపొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 1:ఆదివాసీలు తరతరాలుగా ఎదుర్కొంటున్న...

“శుభకార్యంలో ఆశీర్వాదం.. విషాదంలో పరామర్శ.. ప్రజలకు అందుబాటులో సోయం వీరభద్రం”

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, నవంబర్ 1:అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం నిర్వహించిన శుభకార్యాలు, పరామర్శ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. తొలుత అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఇటుకల...
error: Content is protected !!