ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాలి – రైతు కళ్లలో ఆనందం వెల్లివిరియాలి

వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాలి – రైతు కళ్లలో ఆనందం వెల్లివిరియాలి

📰 Generate e-Paper Clip

కథల్ సావ్ తాత దర్గా ఉర్సులో పాల్గొన్న బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌణి వెంకటన్న గౌడ్ దంపతులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 27, 2026: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాగాపూర్ గ్రామంలో నిర్వహించిన కథల్ సావ్ తాత దర్గా ఉర్సు మహోత్సవంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌణి వెంకటన్న గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ దర్గా ఉర్సులో పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శించుకోవడం సామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరియాలని కథల్ సావ్ తాతను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!