కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జి ఆలస్యం విరన్ జూన్ 8 2026: వాడపల్లి శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం విరన్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, మహా హారతి, కుంకుమార్చన తదితర పూజలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా సాగాయి. లోక కళ్యాణం, ప్రజల శ్రేయస్సు కోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలకు వందలాది మంది భక్తులు హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగి భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం విరన్ మాట్లాడుతూ… “సర్వేజనా సుఖినోభవంతు” అనే సంకల్పంతో పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, శ్రీ కాశీ విశ్వనాథేశ్వర స్వామివారికి శాశ్వత ఆలయ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలస్యం విరన్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. “శివయ్యకు శాశ్వత గృహం నిర్మించడమే నా జీవిత లక్ష్యం. ఆ దిశగా ట్రస్ట్ ద్వారా లోక కళ్యాణ పూజలు, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం” అని చైర్మన్ ఆలస్యం విరన్ తెలిపారు. ఈ కార్యక్రమం భక్తుల విశేష ఆదరణతో విజయవంతంగా ముగిసింది.
