పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రధాన జంక్షన్ లో అతి ప్రమాదకరమైన జంక్షన్ ఏదులాపురం మున్సిపాలిటీ దిలీప్ హాస్పిటల్ మరియు హెచ్ పి బంక్ కూడలి, ఈ జంక్షన్లో వద్ద ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి ఎన్ని కుటుంబాలు భలేవ్వాలి ఇంకా ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కుని కోల్పోతే గాని ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారుల నుండి గాని చలనం రాదా..? ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన జంక్షన్ల వద్ద వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది
మున్సిపాలిటీ పరిధిలోని జంక్షన్ అయినా
నాయుడుపేట నాలుగు రోడ్ల కూడలిలో గతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో పేద కుటుంబాలు వీదినపడ్డాయి వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి మరో ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వం పైన ఉన్నది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ హనుమాన్ జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ సిగ్నల్ వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మీదుగా వివిధ ప్రాంతాల నుండి విపరీతమైన వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. హనుమంతుడు గుడి ఉన్నందున ఎదురుగా వచ్చే వాహనాలు యూటర్న్ తీసుకునే వాహనాలు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది కాబట్టి వెంటనే ఈ జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలి. కోదాడ క్రాస్ రోడ్ జంక్షన్ కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళ వరకు దాబాలు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉంటారు. దాబాలలో ఫ్యామిలీలతో గడిపి రోడ్డు ఎక్కిలోపే హైదరాబాదు నుండి కోదాడ వైపు నుండి వచ్చే వెహికల్స్ అతివేగంగా వచ్చే ఢీ కొట్టి ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉన్నది కాబట్టి ప్రతి జంక్షన్లోనూ రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏదులాపురం మున్సిపాలిటీ *బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారపాటి రమేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పడిన కొత్తలో అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు చూడనట్టుగా వ్యవహరిస్తుంది ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదు *వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి* ప్రధాన జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్, మరియు ట్రాఫిక్ పోలీస్ వారిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము.

