ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివిచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లురవి

విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లురవి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా తప్పుడు ఆరోపణలు చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వనపర్తి శాసనసభ్యులు రేపు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను, పీసీసీ అధ్యక్షులను మహేష్ కుమార్ గౌడ్ గార్లను కలుస్తానన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈనెల 16వ తేదీ ఆదివారం రోజున వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండల కేంద్రంలో రెండవ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడారని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, పార్టీ అధిష్టానాన్ని స్థానిక ఎమ్మెల్యే నైన నాపై తప్పుడు ఆరోపణలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోట్లాది రూపాయలు తీసుకుని తనకు బీఫామ్ ఇచ్చిందని పార్టీని అవమానపరిచి తప్పుడు ఆరోపణలు చేసిన చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన సోమవారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి వెళ్లి కల్వకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవికి కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ… వనపర్తిలో చిన్నారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కాంగ్రెస్ నాయకుల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నారని, గత 20, 30 సంవత్సరాలుగా పార్టీలు అంకిత భావంతో పనిచేస్తూ వస్తున్న దాము పదేళ్లుగా బిఆర్ఎస్ పాలనను ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నామని, నేడు ఎమ్మెల్యే మేఘారెడ్డి పాలనలో తాము సమాజంలో సముచిత గౌరవం పొందుతున్నామని ఇలాంటి సమయంలో చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా, ప్రతిపక్షాల ముందు పార్టీని పలుచన చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని చిన్నారెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సూచించారు. ఇందుకు స్పందించిన ఎంపీ దీనిపై పార్టీ అధిష్టానంతోను మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీనియర్లు అయ్యి ఉండి పార్టీ ప్రతిష్టను నిలబెట్టాలే కానీ ఈ విధంగా మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!