ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జవహర్ నగర్ పి.ఎస్. పరిది బాలిక ఆచూకీ తెలిపిన వారికి విజ్ఞప్తి

జవహర్ నగర్ పి.ఎస్. పరిది బాలిక ఆచూకీ తెలిపిన వారికి విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. జవహర్ నగర్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రీమతి వెముల అనూష కుమార్తె వెముల సాయి ప్రియ @ గంగ, వయస్సు 14 సంవత్సరాలు. బాలిక మానసిక వైకల్యంతో బాధపడుతూ, మాట్లాడటంలో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.                           17-08-2026 ఉదయం సుమారు 8:30 గంటలకు తల్లి పనికి వెళ్లే సమయంలో బాలిక ఇంట్లోనే ఉంది. అదే రోజు సాయంత్రం సుమారు 7:00 గంటలకు తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉండటంతో పాటు బాలిక కనిపించలేదు. బంధువులు, తెలిసిన ప్రదేశాల్లో ఎంత వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.                              బాలిక ఆచూకీ తెలిసిన వారు క్రింది నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు, పోలీసులు కోరుతున్నారు.               8712662097, 8712662103,8712662188 బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించగలరని విజ్ఞప్తి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!