ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అంకిత్

📰 Generate e-Paper Clip

కమలాపురం ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.. ఆర్‌ఓ ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశం

పొలిటికల్ పవర్,ములకలపల్లి, నవంబర్ 3: మండలంలోని కమలాపురం ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వంటశాల, ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, మెనూ అమలు, భోజన సమయాలపై వివరాలు తెలుసుకున్నారు

ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని, వంటశాల, స్టోర్‌ రూమ్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలనే వంటకు ఉపయోగించాలని, ఆహార కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం పాఠశాలలోని తాగునీటి సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్‌.. ఆర్‌ఓ ప్లాంట్‌ పనిచేయకపోవడంపై ఆరా తీశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, విద్యార్థులకు నిరంతరం శుభ్రమైన తాగునీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఈ తనిఖీలో తహసీల్దార్‌ స్వాతి బిందు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున

 

Latest Articles

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసులు అధికారులకు అందజేత

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఎన్నికల హామీలు అమలు...

సపావత్ సుందర్ మరణం బాధాకరం

భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర...

కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ప్రత్యేక గ్రంథంలో శ్రీశైల విశేషాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసులు అధికారులకు అందజేత

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఎన్నికల హామీలు అమలు చేయాలి.. రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లించాలని డిమాండ్‌పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్...

గరీబ్ నగర్ 23వ వార్డులో 360 ఓట్లతో సీపీఎం అభ్యర్థి రణధీర్ ఘన విజయం – రణధీర్ గెలుపు పట్ల శ్రీశైలం మండల నేతల హర్షం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ శ్రీశైలం రిపోర్టర్ ఎస్ జేమ్స్ కె.ఆత్మకూరు పట్టణంలోని గరీబ్ నగర్ 23వ వార్డులో సీపీఎం పార్టీ ఘన విజయం సాధించింది.సీపీఎం...
error: Content is protected !!