ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యుత్ సరఫరా మెరుగుదలకు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం పొలిటికల్...

విద్యుత్ సరఫరా మెరుగుదలకు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 31) అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డులో ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వార్డ్ కౌన్సిలర్ మోర్ల రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. వార్డులో తక్కువ వోల్టేజ్ కారణంగా గృహోపకరణాలు దెబ్బతినడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన కు వివరించారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని, అవసరమైతే అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ మోర్ల రాజేశ్వరి,పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Previous article

Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!