*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
*36 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో లీగల్ సెల్ ఆధ్వర్యంలో సమావేశం*
వినుకొండ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ మున్సిపాలిటీకి సంబంధించిన 36 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ఎన్నికల నియమ నిబంధనలు, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులకు అవసరమైన న్యాయపరమైన అవగాహన కల్పించారు.


