పేద కుటుంబాల రక్షణే ధ్యేయం.. ఒకే ఒక్క ప్రమాదం ఆ కుటుంబాల జీవితాలనే రోడ్డున పడేస్తోంది!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 8 మంది మాదిగ సామాజిక వర్గ పేద కుటుంబాలకు ₹10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు. కానీ, ఇలాంటి కష్టాలు భవిష్యత్తులో ఏ పేద కుటుంబానికీ రాకూడదు. అందుకే కుల, మత, పార్టీల ప్రమేయం లేకుండా సమాజంలో ప్రతి పేద కుటుంబానికి రక్షణ కల్పించేలా “శాశ్వత_ఉచిత_ప్రమాద_బీమా పథకాన్ని” ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే ప్రభుత్వం నుండి వేగవంతమైన సహాయం అందేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. పేదల ప్రాణాలకు, వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఈ డిమాండ్‌కు మనమంతా మద్దతు తెలుపుదాం!

