ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్యా, విజ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకతలను ఆయుధాలుగా చేసుకొని అన్ని రంగాల్లో ఎదగాలి
ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 05 2026: పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో టు విల్లెజిస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు వనపర్తి పట్టణంలోని మాదిగ కుల సంఘం వారితో సమావేశం ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణం కోసం స్థల సేకరణ ఏర్పాటు. ఈ సమావేశాన్ని వనపర్తి పట్టణం కర్రెమ్మ గుడి వద్ద ఎం ఆర్ పి ఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త, నాయకులు గంధం గట్టయ్య మాదిగ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ, ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ లు మాట్లాడుతూ… వర్గీకరణ అవశ్యకతను వివరించడం జరిగింది. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు 30 ఏండ్లు పోరాటం చేసి వర్గీకరణ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. అటువంటి వర్గీకరణ ద్వారా వచ్చే ప్రతి అవకాశాన్ని మాదిగ విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. అలాగే జూలై 7 నాడు ఎం ఆర్ పి ఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని వనపర్తి జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా నూతన జెండా గద్దె నిర్మాణం చేసుకొని ఎం ఆర్ పి ఎస్ జెండాను జూలై 7 న జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించుకోవాలని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ నాయకులు గంధం లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం, గంధం ఎల్లయ్య మాదిగ ఆకులోరా అంజి మాదిగ, ద్వారపోగు మద్దిలేటి మాదిగ తదితరులు పాల్గొన్నారు


