*ఉరి వేసుకుని వృద్ధుని మృతి*
జులై : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షట్ పేట మున్సిపాలిటీలోని మోదెలకు చెందిన తోట లక్ష్మయ్య అనే 80 సంవత్సరాల వృద్ధుడు మొదల శివారులోని తన సొంత పంట పొలం వద్ద దోతితో చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుని భార్య గత మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది మృతునికి ఐదుగురు కుమారులు ఉండగా అందరికీ పెళ్లి చేయడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. మృతుడు ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. మృతుడు వయసు పై పడటంతో బీపీ షుగర్ రావడంతో వైద్యులు చెప్పిన మందులు వాడుతున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు ఈ ఒంటరి బతుకేంటని తన భార్యలగా తనకు కూడా తొందరగా చావు వస్తే బాగుండని బాధపడుతూ చెబితే ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పి ఓదార్చి అప్పుడప్పుడు కుమారుల ఇండ్లలో ఉంచుకునే వాళ్ళు. ఈరోజు ఉదయం తన పంట పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి ఉండడం పక్క పొలానికి చెందిన వాళ్ళు చూసి చెప్పడంతో మృతుని కుటుంబ సభ్యులు వెళ్లి చూసి తన తండ్రి వృద్ధాప్యం అనారోగ్యం భరించలేక ఆత్మహత్య చనిపోయినట్లు మృతుని పెద్ద కొడుకు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా ఏఎస్సై సత్తయ్యకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది అని. ఎస్సై తెలిపారు.

