
అన్నారుగూడెంలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమం .
దొడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో బీసీ కాలనీలో పరిశుభ్రత పనులు .
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు
లక్ష్యాలు చేరుకోవడానికి ప్రజలు విధిగా భాగస్వాములవ్వాలి
– *మాజీ ఎంపీపీ, స్థానిక సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ పిలుపు* .
తల్లాడ సెప్టెంబర్ 25
అన్నారుగూడెం గ్రామాన్ని పరిశుభ్రతకు ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో,స్థానిక సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ నేతృత్వంలో శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. అన్నారుగూడెం రామాలయ పరిసరాల నుంచి బీసీ కాలనీ అంతటా పారిశుద్ధ్య పనులు చేపట్టి, పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు, పిచ్చిమొక్కలను తొలగించారు.
ఈ సందర్భంగా దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అన్నారుగూడెంను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంలో పరిశుభ్రత కార్యక్రమాలు ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలి.ప్రజలు కూడా తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సహకరించాలని ఆయన పేర్కొన్నారు.
గ్రామంలోని ప్రధాన వీధులు,కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక దృష్టి సారించాలని, మురుగు నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
స్థానిక సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో నిరంతర చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ప్రతి కుటుంబం పారిశుద్ధ్య బాధ్యతలో భాగస్వామయితేనే స్వచ్ఛ అన్నారుగూడెం లక్ష్యాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సర్పంచ్ గొడ్ల ప్రభాకర్,వార్డ్ మెంబర్ రాజబంటి వంశీ, పంచాయతీ సెక్రెటరీ కె వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు సుంకర రోశయ్య, సుంకర జగ్గయ్య, సుంకర నాగేశ్వరరావు,గ్రామ ప్రజలు,పంచాయతీ గుమస్తా రమేష్, పంచాయతీ సిబ్బంది,స్థానిక నాయకులు పాల్గొని పారిశుద్ధ్య పనుల్లో భాగస్వాములయ్యారు.

