ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి చిన్నారెడ్డి పరామర్శ

📰 Generate e-Paper Clip

 

లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు మనోధైర్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 24 2026: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి దివంగత భీరం లక్ష్మారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హర్షవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లిన చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లక్ష్మారెడ్డి మృతి కుటుంబానికి తీరని లోటని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన లేని లోటును పూడ్చలేనప్పటికీ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, దుఃఖాన్ని అధిగమించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దివంగత లక్ష్మారెడ్డి సేవలను, కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పలువురు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. వనపర్తి సీనియర్ నాయకులు ఎంట్ల రవి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని లక్ష్మారెడ్డికి నివాళులర్పించారు.

Latest Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట...

చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్...

అకాల వర్షాల బాధిత కుటుంబాలకు ప్రాధాన్యతా క్రమంలో సహాయం – అమలు బాధ్యతలు స్పష్టంగా ఉండాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

కరీంనగర్ రెడ్‌క్రాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: ప్రత్యేక ఆకర్షణగా చిదుర సురేష్ నామినేషన్!*

 కరీంనగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) ఎన్నికల ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మధ్యాహ్నం 1...

*కరీంనగర్ రెడ్‌క్రాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: ప్రత్యేక ఆకర్షణగా చిదుర సురేష్ నామినేషన్!* 

  కరీంనగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) ఎన్నికల ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మధ్యాహ్నం 1...

ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.! విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, “అర్నబ్ ” తుఫాన్, దాని యొక్క ప్రభావం వలన, గాలులు మరియు వర్షాలు ఉండవచ్చును. కావున...

 *1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.**2. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.**3.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.**4.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత, మీ ఊరు...
error: Content is protected !!