NMMS స్కాలర్షిప్‌కు ఎన్నికైన జెండా వెంకటాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా లక్షట్ పెట్ : గత నవంబర్ నెలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి NMMS స్కాలర్షిప్ పరీక్షలో జెండా వెంకటాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు అక్షర, వర్ష ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. వీరికి నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ అందనుంది.
లక్షెట్టిపేట మండలంలో ఎంపికైన ఇద్దరు విద్యార్థులు తమ పాఠశాలకు చెందినవారే కావడం ఎంతో గర్వకారణమని ప్రధానోపాధ్యాయురాలు జి. యశోదర తెలిపారు. జెండా వెంకటాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా NMMS ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్‌కు ఎంపికవుతూ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
అలాగే, ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతిలో పాఠశాల 100% ఫలితాలు సాధించడం విశేషమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులు అభినందించారు.
