ePaper
Sunday, June 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రెటరీగా సైఫుల్ల ఖాన్*

పొలిటికల్ పవర్ బషీర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి

బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, దేశ బహుజనుల ఆశాకిరణం బహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహం శేఖర్ గారి ఆశీస్సులతో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా అప్పగించిన ఈ బాధ్యత పట్ల నా హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది

ఈ సందర్భంగా నాపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ గారికి సెక్టార్ చీఫ్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావు గారికి మాజీ ఎమ్మెల్సీ సెంట్రల్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య గారికి, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్‌కృష్ణ గారికి పార్టీ శ్రేణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఈ బాధ్యతను నేను ఒక పదవిగా కాకుండా, కోట్లాది బహుజనుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే ఒక పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నాను. మహనీయులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు రచించిన రాజ్యాంగ విలువలను, మాన్యవర్ కాన్షీరామ్ నిర్మించిన బహుజన ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయడానికి నా సంపూర్ణ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తాను

సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానం మరియు రాజకీయ సాధికారత అనే బహుజన ఉద్యమమూల సిద్ధాంతాల సాధన కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాటం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను

తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేసి బహుజనుల స్వరాన్ని శాసనసభలలో ప్రజా వేదికలలో మరింత బలంగా వినిపించే దిశగా అంకితభావంతో పనిచేస్తాను

నాయకత్వం అనేది అధికారం కాదు ప్రజల విశ్వాసాన్ని మోసే బాధ్యత పదవి అనేది హోదా కాదు సమాజానికి సేవ చేసే అవకాశం

మీ అందరి ఆశీర్వాదాలు సహకారం మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ నాతో ఉంటాయని ఆశిస్తూ జై భీమ్ జై బీఎస్పీ జై తెలంగాణ సైఫుల్లా రాష్ట్ర సెక్రటరీ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!