పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: వనపర్తి పట్టణానికి చెందిన బైరోజు సూరజ్ కు హరి డీమ్డ్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డా.నర్సిరెడ్డి గోల్డ్ మెడల్ ను ప్రదానం చేశారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తొంభై శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు హరి డీమ్డ్ యూనివర్సిటీ వారు బంగారు పతకాలతో సత్కరిస్తామని ప్రకటించారు.ఆ నేపథ్యంలో 982 మార్కులు సాధించిన బైరోజు సూరజ్ ను గోల్డ్ మెడల్ తో,ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతి వనంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, జెఎన్ టి యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి, సిబీఐటి ఇంజనీరింగ్ కళాశాల డీన్ డా. ఎన్. ఎల్. ఎన్.రెడ్డి, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సూరజ్ కు గోల్డ్ మెడల్ లభించడం పట్ల సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, ప్రతినిధులు కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్ర శేఖర్, డా.శ్యాం సుందర్, బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు, శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు.
