ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సత్తుపల్లి ఏరియాలో 4వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు.

 

పీఆర్పీ బకాయిల విడుదల, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని ప్రధాన డిమాండ్.

 

స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక.

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి

 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎస్‌సీసీఎల్ ఏరియాలో సింగరేణి అధికారుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – ఎస్ సి సి ఎల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో (గురువారం) విజయవంతంగా 4వ రోజుకు చేరుకున్నాయి.

 

దీక్షా శిబిరంలో కూర్చున్న అధికారులకు తోటి ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధిలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన డిమాండ్లు:

పీఆర్పీ బకాయిలు: నిలిచిపోయిన పీఆర్పీ బకాయిలనుతక్షణమే విడుదల చేయాలి, పే అప్‌గ్రేడేషన్: అధికారుల సుదీర్ఘకాల సమస్య అయిన పే అప్‌గ్రేడేషన్‌ను వెంటనే అమలు చేయాలి. ఈ రిలే నిరాహార దీక్షలు జూలై 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని, యాజమాన్యం సానుకూలంగా స్పందించని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!