ePaper
Thursday, August 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బీసీ ( డి ఎన్ టి )- వడ్డెర మహిళకు ఎమ్మెల్సీ పదవి — యావత్ బీసీ -వడ్డెర కుల సమాజానికి గర్వకారణం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు శ్రామిక సంచార కుల జాతుల చరిత్రను మోస్తూ, కష్టాన్ని నమ్ముకుని జీవించే డి యన్ టి – వడ్డెర కుల సమాజంలో మహిళలకు కూడా రాజకీయ నాయకత్వంలో సముచిత స్థానం రావాలి అనే ఆకాంక్ష ఎప్పటినుంచో ఉంది. అలాంటి మన బీసీ ( డి ఎన్ టి )- వడ్డెర మహిళ, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు శ్రీమతి దళవాయి రమాదేవి (అనంతపురం )కి ఎమ్మెల్సీ పదవి లభించడం నిజంగా ఒక చారిత్రాత్మకమైన, గర్వించదగ్గ పరిణామం. రాజకియంగా పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న వడ్డెర కులo నుంచి ఒక మహిళ రాజకీయంగా ఎదిగి శాసన మండలిలో అడుగుపెట్టడం అనేది సాధారణ విషయం కాదు. జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలిగా, ప్రజలతో, మహిళలతో మమేకమై పనిచేస్తూ, రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగిన శ్రీమతి రమాదేవి కి ఈ ఏమ్మెల్సీ పదవి లభించడం ఆమె రాజకీయ కృషికి లభించిన గుర్తింపుగా బీసీ మహిళా సమాజం భావిస్తోంది. గత రాజకీయ ప్రయాణంలో ఆమెపై కేసులు నమోదైన విషయాలు ఉన్నప్పటికీ, వాటిని ఎదుర్కొంటూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించడం ఆమె పోరాట పటిమకు ఒక ఉదాహరణ. ఒక బీసీ వడ్డెర మహిళకు ఎమ్మెల్సీ పదవి అంటే కేవలం ఒక వ్యక్తికి లభించిన పదవి కాదు ఒక శ్రామిక కుల సమాజానికి ( డి ఎన్ టి ) లభించిన గౌరవం. ఒక మహిళ గా తన కష్టానికి లభించిన గుర్తింపు. జిల్లా అంగన్వాడీ నాయకత్వం నుంచి శాసన మండలి వరకు సాగిన ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. రాబోయే తరాల బీసీ – డి ఎన్ టి మహిళలకు లభించిన ఒక కొత్త ఆశ.ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి, విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ కి, అలాగే పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ కి యావత్ బీసీ – డి ఎన్ టి -వడ్డెర కుల సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.శ్రీమతి రమాదేవి ఈ విజయం ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి యువతికి ఒక గొప్ప సందేశం అవకాశం లభిస్తే బి సి- డి ఎన్ టి మహిళ లు కూడా నాయకత్వం వహించగలరు.అవకాశం ఇస్తే ప్రతి మహిళ కూడా చరిత్ర సృష్టించగలదు శ్రీమతి రమాదేవి కి హృదయపూర్వక అభినందనలు. ఇది ఒక్క రమాదేవి విజయం కాదు ఇది యావత్ బీసీ – డి యన్ టి – వడ్డెర కుల సమాజం గర్వించాల్సిన విజయం! జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలి స్థాయి నుంచి ఏమ్మెల్సీ స్థాయి వరకు.

 

ఇది మహిళా శక్తికి ఒక కొత్త అధ్యాయం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!