ePaper
Saturday, August 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మాధురి రాఠోడ్ ఫిర్యాదుతో కలకలం..

ఫోన్ చోరీ చేసి వీడియోలు వైరల్ చేశారని ఆరోపణ

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

జానపద కళాకారిణి మాధురి రాఠోడ్ తనపై దురుసుగా ప్రవర్తించి, దాడి చేయడంతో పాటు తన ఫోన్‌ను చోరీ చేసి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపిస్తూ వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 19న రెడ్డి భవన్‌లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిందని మాధురి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన సమయంలో సుమారు రూ.50 వేల విలువైన తన ఐఫోన్‌ను కూడా తీసుకెళ్లారని ఆరోపించారు.

అంతేకాకుండా తనకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వాటిని తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు కూడా తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాయని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా వేములవాడ పోలీసులు శరణ్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…..

Previous article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!