ePaper
Saturday, August 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

శ్రీ మహావిష్ణు ఆలయానికి విద్యుత్ సౌకర్యం కోసం ప్రజావినతి

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

 

ఈరోజు 24-08-2026న శ్రీ శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణుమూర్తి ఆలయం, చెల్లంపేటకు విద్యుత్ సరఫరా కల్పించాలనే డిమాండ్‌తో లక్షెట్టిపేట మండల ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేక భక్తులు, ఆలయ నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన విద్యుత్ సరఫరా కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొప్పు సతీష్ – తెలంగాణ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు, కొండా నరేష్ – గో సంరక్షణ సమితి సభ్యులు, ముత్త భీమేష్ – గో సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి, దండేపల్లి మండలం, అంకతి శ్రీకాంత్, బందెల రవి గౌడ్, బియ్యాల దినేష్, అంకతి వెంకటేష్, ఈశ్వర్, ఎర్రం నరేష్,. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణుమూర్తి ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించే వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!