పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కామంచికల్, జూన్ 14 2026: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్ ), కామంచికల్‌లో 2001-2002 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది. దాదాపు 24 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందించిన ఉపాధ్యాయులు కె. వెంకటేశ్వర్లు (హెచ్‌ఎం), జి. రామమూర్తి, ఎం. అనంతరాములు, ఎం.డి. ఉమర్, టి. వీరయ్య, ఎం.డి. షమీమ్ తలత్, టి. బుచ్చిబాబు, పి. ప్రసూన, ఎం. రోహిణి, వై. ప్రేమలత, ఎ. రమాదేవి లను పూలతో ఆహ్వానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి, మెమెంటోలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థుతో ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ వద్ద చదువుకున్న విద్యార్థులు నేడు వివిధ రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా 2001-2002 బ్యాచ్ నుండి పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాచ్‌కు చెందిన బొడా రమేష్ ప్రస్తుతం వరంగల్‌లో ఐటీ సీఐగా విధులు నిర్వహిస్తున్నారని, అలాగే యాట రంగారావు, మాలోతు రమేష్, భూక్య ఉపేందర్ పోలీసు శాఖలో, మేకల సైదులు ఆర్మీ డిపార్ట్మెంట్ లో, భూక్యా వీరన్న బీహెచ్ఈఎల్ ఢిల్లీలో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రాగి సత్యనారాయణ సర్వేయర్, అంబేద్కర్ రియల్ ఎస్టేట్, పుల్లారావు గ్రానైట్ ఫీల్డ్, కొప్పెర సత్యనారాయణ వ్యవసాయం, నామాల నాగరాజు హాస్పటల్ మేనేజ్మెంట్, బొడా వీర అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్రయివేట్), తాటి శ్రీకాంత్ ఎన్ హెచ్ ఏ ఐ హైవే ఆఫీసర్, షేక్ జానీ తదితరులు ప్రైవేట్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి 2002 10 వ బ్యాచ్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చారని,మగవారికేమి తక్కువ ఏమి కామంటూ,ఆడపిల్లలు స్వంత వ్యాపారంలో ఎదిగి న వారిలో కల్యాణి, పద్మజ, జ్యోతి, విప్రో ఐ టి లో సుజాత,కొందరు వ్యవసాయ రంగంలో ఎదిగిన వారు కూడా ఉన్నారని వారిని కూడా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా 2001-2002 పదవతరగతి బ్యాచ్ విద్యార్థులు, విద్యార్థినులే స్వచ్ఛందంగా విరాళాలు సమకూర్చుకొని నిర్వహించుకోవడం విశేషం. వివిధ జిల్లాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థినులు కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మధ్యాహ్న భోజనానంతరం ఉపాధ్యాయుల సన్మానం, మాటామంతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీ బ్రేక్ తర్వాత అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. పాఠశాల రోజులను సరదాగా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉపాధ్యాయులతో కలిసి ఆనందంగా గడిపారు. తదనంతరం వినోద కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం కార్యక్రమాన్ని ముగించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ అందరి హృదయాలలో చిరస్మరణీయ జ్ఞాపకంగా నిలిచింది.
