ePaper
Saturday, August 1, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు… భవిష్యత్తులో విజయాలు!

జూన్ 15 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఈ రోజు లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ని 13వా వార్డు పాఠశాలలో చైర్‌పర్సన్ శ్రీమతి దొంత అంజలి నర్సయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, లక్షెట్టిపేట జెడ్పీహెచ్‌ఎస్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లక్సెట్టిపేట 13వ వావార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ విద్యార్థులను ప్రోత్సహించారు.వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభమై బడిగంట మోగింది. ఆటపాటలతో గడిపిన విద్యార్థులు తిరిగి తరగతి గదులకు చేరుకోవడంతో పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. సెలవుల అనంతరం పిల్లలు పాఠశాలలకు వెళ్ళమని పిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులు బుజ్జగించి పాఠశాలకు పంపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దొంత అంజలి నరసయ్య వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి గౌడ్ కోఆప్షన్ నెంబర్ తైసిన్ హాజీ తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!