ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తప్పుల తడకగా NTR భరోసా కొత్త ఫించన్ల నమోదు ప్రక్రియ,50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ హామీని అమలు చేయాలి, చేతి వృత్తుదారులందరికి సామాజిక భద్రత కల్పించాలి…..

తోలేటి శ్రీకాంత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు…

2024 ఎన్నికల సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి బీసీలకు 50 సంవత్సరాల వయస్సు నుంచే నెలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేల్కొంది

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న  ఎన్టీఆర్  భరోసా  పెన్షన్ పథకం అధికారిక వివరాల్లో కొత్త పెన్షన్ల ఎంపికలో ప్రభుత్వ అధికారిక జాబితాలో చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మంగలి/బార్బర్లు, రజకులు, కుమ్మరులు, కమ్మరులు, వడ్రంగులు, చెప్పుల తయారీదారులు, పశువుల కాపరులు, గ్రామీణ కళాకారులు తదితరులను చేర్చక పోవటం శోచనీయం.

ఉత్పత్తి కులాలైన బీసీలు ఎక్కువ శాతం చేతువృత్తులపై ఆధారపడిన కారణంగా ఆయావర్గాలను ప్రత్యేక కేటగిరి క్రింద గుర్తించాలి,

కొండపల్లి బొమ్మల కళాకారులు, స్వర్ణకారులు,

ఏటికొప్పాక చెక్క బొమ్మల కళాకారులు, బొబ్బిలి వీణ తయారీదారులు, కలంకారి చిత్రకారులు, తోలుబొమ్మల కళాకారులు, చెక్క శిల్పకారులు, రాతి శిల్పకారులు, బుట్టలు–చాపలు తయారు చేసేవారు, వెదురు–బెత్తం, మేదరకళాకారులు, మట్టి బొమ్మలు–మట్టి పాత్రల తయారీదారులు, సంప్రదాయ సంగీత వాయిద్యాల తయారీదారులు, పడవల తయారీదారులు, చిత్రకారులు వంటి అనేక మంది కూడా తరతరాలుగా తమ కళలు, వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు…

వీరిని కూడా ఇతర గ్రామీణ కళాకారులు , సంప్రదాయ కళాకారులు కింద గుర్తించి సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.

కళాకారులు ఈ కేటగిరీలోకి వస్తారనే దానిపై ప్రభుత్వం ప్రత్యేకంగా స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించాలి.

వైకాపా చేతివృత్తుల విభాగం తరుపున ప్రధాన డిమాండ్లు:

50 సంవత్సరాలు నిండిన అర్హులైన బీసీ చేతివృత్తిదారులకు నెలకు రూ.4,000 పెన్షన్ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలి.

* కమ్మరి, వడ్రంగి, కుమ్మరి, మంగలి, రజక, చేనేత, కల్లు గీత, చెప్పుల తయారీదారులు తదితర చేతివృత్తిదారులకు పెన్షన్ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.

పట్టణ,మరియు గ్రామీణ ప్రాంతాల చేతివృత్తుల కింద ఎవరెవరు వస్తారో ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేక జాబితా విడుదల చేయాలని తోలేటి శ్రీకాంత్ డిమాండ్ చేసారు..

కొండపల్లి, ఏటికొప్పాక, స్వర్ణకారులు,చిత్రకారులు,బొబ్బిలి వీణ, కలంకారి, తోలుబొమ్మలు, రాతి శిల్పాలు, చెక్క శిల్పాలు, వెదురు–బెత్తం, మెదర, కాలంకారి, కాళహస్తి కొయ్య బొమ్మలు,కళలు, మట్టి కళలు తదితర సంప్రదాయ కళాకారులను కూడా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలి.

సంప్రదాయ కళాకారులకు ఆధునిక పనిముట్లు, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, శిక్షణ మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత కల్పించాలి.

కూటమి ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ఇప్పటివరకు అమలు చేయకుండా అటకెక్కించింది దానిని మరింత విస్తరించి అన్ని సంప్రదాయ చేతివృత్తిదారులకు అందుబాటులోకి తీసుకురావాలి.

చేతివృత్తిదారులు కేవలం ఒక వృత్తిని చేసుకునే వ్యక్తులు కాదు. వారు మన సంస్కృతిని, మన సంప్రదాయాలను, మన కళా వారసత్వాన్ని తరతరాలకు అందిస్తున్న కళాకారులు…

వివిధ రసాయనాలతో పనిచేసే వారికి త్వరగా అనారోగ్య సమస్యలు వస్తున్నందున వారికి కనీస సామాజిక భద్రత లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని చేతివృత్తిదారులకు న్యాయం చేయాలి.

…చేతివృత్తిదారుడు బతికితేనే వృత్తి బతుకుతుంది..

వృత్తి బతికితేనే మన సంప్రదాయం బతుకుతుంది.

సంప్రదాయం బతికితేనే మన సంస్కృతి బతుకుతుంది.

… అందువల్ల 50 ఏళ్లకే పెన్షన్ హామీని అమలు చేయడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని అర్హులైన సంప్రదాయ చేతివృత్తిదారులు, గ్రామీణ కళాకారులకు సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ..గత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేతివృత్తుదారులకు చిరు వ్యాపారులకు జగనన్న చేదోడు జగనన్న తోడు పథకాల ద్వారా ఆదుకున్న విషయాన్ని గుర్తుంచు కోవాలని కోరారు …

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!