తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు..
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు..
మంచిర్యాల నియోజకవర్గంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ..ఈసందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవన శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా OBC చైర్మన్ వొడ్డే రాజమౌళి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

