ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలకు కొత్త దిశ – డా. మల్లురవి వ్యాఖ్యలు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: సోమవారం రోజు ప్రకటించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్‌కర్నూల్ ఎంపీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లురవి స్పందించారు. ఆయన ప్రకారం, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ పార్టీకి సానుకూల సంకేతంగా నిలిచిందన్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ బలాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం బీజేపీకి ప్రతికూల పరిణామమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పాండిచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని కొనసాగించగలిగిందని తెలిపారు. డీఎంకే నేత స్టాలిన్, టీఎంసీ నేత మమతా బెనర్జీ, టీవీకే నాయకుడు విజయ్ తదితరులు ఇండియా కూటమిలో చేరే అవకాశమున్న నేపథ్యంలో, 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్‌డీఏ కంటే బలంగా ఎదిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేరళలో కాంగ్రెస్ విజయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల ఆశలను చెదరగొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

Related Articles

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వివిధ పార్టీల నేతలుపొలిటికల్.పవర్ సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్.9టీవీన్యూస్వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్ 17.2026. వనపర్తి జిల్లాకొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గల కీర్తిశేషులు మాజీ...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్లు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డిపోలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగుదినపత్రిక ...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,–  కొత్తకోట ఎస్సై. విక్రమ్, భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.12.2026.వచ్చే...
error: Content is protected !!