తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి
హర్షం వ్యక్తం చేసిన అధ్యక్షులు, డైరెక్టర్లు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 08 మే 2026: పెద్దమందడి వ్యవసాయ సింగిల్ విండో పాలకమండలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇటీవల సింగిల్ విండో పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేయగా, ఆ నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువడింది. అనంతరం తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి సభ్యులు సమావేశం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం పాలకమండలి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. సహకార సంఘాల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు మాట్లాడుతూ… తిరిగి బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, పాలకమండలి సభ్యులు నరేష్, రామ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుందరమ్మ, వెంకటయ్య, మన్నెంకొండ, సీఈవో సుధాకర్, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
