ePaper
Friday, October 30, 2026
📄 ePaper

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 30 2026: వనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) క్రీడా పోటీలను అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్‌నగర్ జోన్ ఏజీఎం వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలోనూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అదేవిధంగా పాఠశాల బ్రాంచ్ ప్రిన్సిపాల్ బయేందర్ మాట్లాడుతూ… విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు నిర్వహించడం వల్ల శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. జట్టుగా కలిసి పనిచేయడం, సమిష్టి కృషితో లక్ష్యాన్ని చేరుకోవడం, గెలుపోటములను సమానంగా స్వీకరించడం వంటి విలువలు క్రీడల ద్వారా అలవడతాయని వివరించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Latest Articles

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

పోలీస్ అక్క స్వీయ రక్షణపై అవగాహన సదస్సు..సైబర్ భద్రత,లైంగిక వేధింపుల నివారణ

పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ (...

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్...

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్  అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 31. 2026....

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్  అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్.31.2026.రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం  వేసవిలో నీటి ఎద్దడి నివారణకు...

పట్టాభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో ఆన్లైన్ లో సమర్పించిన ఆధారంగా బిఎల్ఓల ద్వారా విచారణ జరిపించాలి

– ఓటును ఆమోదించాలని తాసిల్దార్ కు వినతి పత్రంసమర్పించిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్,మాజీ జడ్పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్,మాజీ కౌన్సిలర్లు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...
error: Content is protected !!