ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బస్సు తిరగలేక ఇబ్బందులు గుంతలు పూడ్చి సమస్య తీర్చిన సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి

 

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ ) మే ములకలపల్లి మండలం

మూకమామిడి గ్రామపంచాయతీ లో ప్రధాన రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతల తో బస్సు తిరగలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి శనివారం స్వయంగా పర్యవేక్షించి మట్టి తో గుంతలను పూడ్పించారు.గత కొన్ని రోజులుగా రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా ఆర్టీసీ బస్సు గ్రామంలోకి రావడానికి డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని,దీంతో ప్రయాణికులు,విద్యార్థులు,ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు సర్పంచ్‌కు విన్నవించారు.వెంటనే స్పందించిన సర్పంచ్ పంచాయతీ సిబ్బందితో కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయించారు.ప్రజల సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించడం నా బాధ్యత.శాశ్వత పరిష్కారం కోసం ఉన్నత అధికారులకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు ప్రతిపాదనలు పంపుతాం అని సర్పంచ్ ఆదిలక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు.గుంతలు పూడ్చడం తో బస్సు సాఫీగా తిరుగుతుందని,సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్‌కు ప్రయాణికులు,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ గ్రామ పెద్దలు ముత్యం బిక్షం అనంతుల రవి చిట్టి సత్యనారాయణ పంచాయతీ యువకులు గడ్డం వెంకటేష్ రింగు బాలకృష్ణ సున్నం శ్రీను మడకం భాస్కర్ ఎర్రంశెట్టి చంటి కోర్సపండు వేముల రాజా రింగు పవన్ తుదితరులు పాల్గొన్నారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!