ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రజలందరూ ముక్కున వేలు వేసుకునే లాగా చేస్తున్నారు, కరెంట్ పోల్ నుండి హై టెన్షన్ వైర్ కి కలెక్షన్ ఇచ్చి నడి ఇంటిపై నుండి వేరొక ఇంటికి హై వోల్టేజ్ విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు, ఇప్పటికే రెండుసార్లు విద్యుత్ తీగలు అరిగి మంటలు వచ్చాయి, స్థానికులు భయాందోళనకు గురై, ఇదే సమాచారాన్ని విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు, ఆ తెగిన వైర్లను మళ్లీ జాయిన్ చేసి చేతులు దులుపుకున్నారు, అసలే వేసవికాలం ఇంట్లో ఉడకకు తట్టుకోలేక డాబా పడుకునే రోజులు, వేసవి సెలవుల కారణంగా పిల్లలు ఆడుకుంటూ ఉండే రోజులు, తల్లాడ మండలంలోని కార్తిక ఈ విధంగానే నిర్లక్ష్యం వహించిన విద్యుత్ తీగల వల్ల ప్రమాదానికి గురై మరణించిన సంఘటన ప్రజల ఇంకా మరవనే లేదు, కానీ విద్యుత్ అధికారులు మాత్రం కళ్ళు తెరవడం లేదు, ఇది అధికారుల నిర్లక్ష్యమా, చర్యలు తీసుకోవడానికి భయమా, లేదా ఏమైనా ముడుపులు అందుతున్నాయా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు..

చదువుకున్న మంచి స్థానంలో ఉన్న విద్యుత్ అధికారులు భవన నిర్మాణ యజమానులకు ప్రమాదాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందా? లేదా?,

ప్రమాదం జరిగాక భవన నిర్మాణ యజమానుల మీదకి నెట్టేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారా?

ప్రజలకు ఎన్నడూ అంతుచిక్కని విషయం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!