ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బక్రీద్ పండుగ నేపథ్యంలో సమన్వయ సమావేశం సైబరాబాద్ సీపీ రమేష్.

 

 

శేరిలింగంపల్లి మే 27 పొలిటికల్ పవర్ న్యూస్ ప్రతినిధి.

 

బక్రీద్ పండుగ సందర్భంగా పండుగను ప్రశాంతంగా, పరిశుభ్రంగా నిర్వహించేందుకు సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ ఆధ్వర్యంలో సీఎంసీ, రెవెన్యూ, వెటర్నరీ శాఖ అధికారులతో మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ పోలీస్ అధికారులు, ఎస్‌హెచ్‌వోలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

బక్రీద్ పండుగ సందర్భంగా పరిశుభ్రత, ప్రజారోగ్యం, జంతు వ్యర్థాల సక్రమ నిర్వహణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈద్‌గాహ్‌లు, మసీదులు మరియు నివాస ప్రాంతాల వద్ద జంతు వ్యర్థాల సేకరణ కోసం మందమైన నల్ల పాలిథిన్ కవర్లు అందుబాటులో ఉంచడం, వ్యర్థాల తరలింపుకు తగిన వాహనాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. అలాగే రోడ్లు, ప్రజా ప్రదేశాల శుభ్రత కోసం తగినన్ని వాటర్ ట్యాంకర్లు, పారిశుధ్య సిబ్బందిని నియమించడం, అవసరమైన చోట్ల బ్లీచింగ్ పౌడర్ వినియోగించడం ద్వారా దుర్వాసన నివారణతో పాటు పరిశుభ్రతను కాపాడాలని సూచించారు.సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. పండుగ సందర్భంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈద్‌గాహ్‌లు, మసీదులు, నివాస ప్రాంతాల వద్ద జంతు వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా అధికారులు సూచించిన విధంగా పాలిథిన్ కవర్లలో సేకరించాలని తెలిపారు. వ్యర్థాల తొలగింపు, రోడ్ల శుభ్రత, పారిశుధ్య నిర్వహణ కోసం సీఎంసీ, రెవెన్యూ, వెటర్నరీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చూసించారు.పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య సిబ్బంది, వాటర్ ట్యాంకర్లు, వ్యర్థాల తరలింపు వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన చోట్ల బ్లీచింగ్ పౌడర్ వినియోగించి పరిశుభ్రతను కాపాడాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా పోలీసులకు, సంబంధిత శాఖల అధికారులకు సహకరించి పరిశుభ్రత, ప్రజారోగ్యం, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని సీపీ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఎస్ బి డీసీపీ సుధీంద్ర, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, సీ ఏ ఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest Articles

ఆదివాసుల హక్కులు, చట్టాలు, జీవోల రక్షణ కోసం అక్టోబర్ 5న మహాధర్నా

పొలిటికల్ పవర్, సెప్టెంబర్,19:పాల్వంచ: ఆదివాసుల హక్కులు, రక్షణ చట్టాలు, ప్రభుత్వ జీవోలను...

వెంకయ్య గారి మరణం మరువలేని జ్ఞాపకం కుటుంబానికి తీరని లోటు

59వ డివిజన్ దానవాయిగూడెం బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామళ్ల రవి  తండ్రి దామళ్ల...

ఉరి వేసుకుని వ్యక్తి మృతిసెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*సెప్టెంబర్ 19:  పొలిటికల్ పవర్ పిన్ 9...

తల్లాడ లో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు రెడ్డి యువజన విభాగం ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం

  తల్లాడ, సెప్టెంబర్ 19:పొలిటికల్ పవర్ ప్రతినిధి  తల్లాడ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!