జూన్ 6న ఇంటర్ కాలేజీలు పునః ప్రారంభం.

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో
తెలంగాణ: ఇంటర్ కాలేజీల పునఃప్రారంభాన్ని ఇంటర్ విద్యామండలి వాయిదా వేసింది. సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల జూన్ 5 వరకు ఉన్నందున 6న కాలేజీలు పునఃప్రారంభమవుతాయని బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓవైపు కొన్ని కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఉండటం, సిబ్బందికి పరీక్షల విధుల కేటాయించిన నేపథ్యంలో పునఃప్రారంభ తేదీని మార్చినట్లు తెలిపారు.
